విజయనగరం జిల్లా,మహా పత్రిక.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ నిబద్ధతతో పనిచేస్తున్నాయి ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు బొబ్బిలి స్టేషన్ పరిధిలో25 మద్యం షాపులు మరియు03 బార్ల నందు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి మద్యం నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించాక అక్కడికక్కడే నమూనాలను పరీక్షించి ఆ తరువాత రసాయన విశ్లేషణ నిమిత్తం విశాఖపట్నంలో గల ఎక్సైజ్ లేబరేటరీ కి పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు 230 నమూనాలను సేకరించి నివేదికలను తెప్పించడం జరిగింది. నివేదికలో ఇచ్చిన వివరాలను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సరఫరా చేస్తున్నటువంటి మద్యం పూర్తి నాణ్యత ప్రమాణాలకు లోబడి నాణ్యమైనదిగా ఉన్నట్టుగా వెల్లడైంది.ఇక మీదట కూడా ప్రతి నెల అన్ని షాపుల నందు నమూనాలను సేకరించి పరీక్షించడం ద్వారా మద్యం యొక్క నాణ్యతను తెలుసుకోవడం జరుగుతుంది. వినియోగదారులకు ఎవరికైనా మద్యం నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు మరియు కల్తీ మద్యం ఎవరైనా తయారుచేసిన,కల్తీ మద్యాన్ని అమ్మిన మాకు ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.







