Mahaa Daily Exclusive

  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన: ఎమ్మెల్యే బేబీ నాయన.

Share

విజయనగరం జిల్లా,మహా పత్రిక: బొబ్బిలి నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఉన్న రోడ్డు సమస్యలకు పరిష్కారదిశగా బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) కృషి చేస్తున్నారు.అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ,పారాది వంతెన పనులు పూర్తికానందున, వర్షా కాలంలో భారీ వాహనాలను అలజంగి,తెర్లాం మీదుగా మళ్ళించవలసి వస్తుందనే కారణంగా,బొబ్బిలి – తెర్లాం మరియు బొబ్బిలి పట్టణ రోడ్డు పనులు ప్రారంభించలేదని పలుమార్లు ఎమ్మెల్యే బేబీనాయన గారు పత్రికా ముఖంగా తెలుపడం జరిగింది.ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టినందున, ముందుగా బొబ్బిలి – తెర్లాం రోడ్డు రేజేరు మీదుగా పనులకు ఈరోజు శాసనసభ్యులు బేబీనాయన శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలో ఎస్.ఏ.ఎస్.సి.ఐ నిధులు రూ4.5 కోట్లతో ఈ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అనంతరం, పినపెంకి – ఆకులకట్ట మధ్య రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ రోడ్డుకు గాను రూ2.9 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపి, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాస్సడర్లను సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో పారాది వంతెన మరమ్మత్తుల సాకుతో అరకొర పనులు చేసి ప్రజాధనాన్ని వృథా చేశారే తప్ప, శాశ్వత పరిష్కారానికి ఏనాడూ ప్రయత్నం చేయలేదని అన్నారు. బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు తాను మాటయిచ్చిన విధంగా, ప్రతి రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని, అలాగే, ప్రధాన రహదారుల సమస్య పరిష్కారం అయిన తరువాత, ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేసేలా రోడ్లను నిర్మిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు,బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, బాడంగి మండల టీడీపీ అధ్యక్షులు తెంటు రవి, అలజంగి సర్పంచ్ ప్రతినిధి రేజేటి బుజ్జి, టీడీపీ సీనియర్ నాయకులు బడే జానీ,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,టీడీపీ నాయకులు, కార్యకర్తలు,ఆర్&బీ అధికారులు పాల్గొన్నారు.

Latest