- సీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శుభాకాంక్షలు
హైదరాబాద్, మహా: ప్రముఖ సినీనటుడు చిరంజీవి.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సైబరాబాద్ సీపీగా పనిచేసిన సమయంలో, కరోనా సమయంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Post Views: 48







