- ఏ కోర్టుకు వెళ్ళినా 50శాతం దాటదు
- పాత పద్ధతిలో ఎన్నికలు బెటర్
- స్థానికంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
హైదరాబాద్, మహా
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో 50 శాతానికి మించి ముందుకు వెళ్తే దేశంలోని ఏ కోర్టు అయినా అడ్డుపడుతుందని అన్నారు. రాజ్యాంగం, దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించితే తప్పులు దోర్లే అవకాశం ఉందని కామెంట్ చేశారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరింత ఆలస్యం చేస్తే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
Post Views: 51







