- ఎస్సారెస్పీ రెండవ దశకు రారెడ్డి దామోదర్ రెడ్డి పేరు
- తుంగతుర్తికి గోదావరి జలాలు రప్పించిన ఘనత ఆర్డీఆర్ దే
- కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అలు పెరుగని పోరాటం చేసిన యోధుడు
- దామోదర్ రెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
- దామన్నవల్లనే మందుల సామెల్ కు 50 వేల మెజార్టీ
- ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
- ఆర్ డీఆర్ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి
తుంగతుర్తి, మహా : రాజకీ యాలలోకి వచ్చి ప్రజాసేవ కోసం సొంత ఆస్తులను సైతం ప్రజాసేవ కో సం ధారబోసిన గొప్ప నాయకుడు దివంగత నేత మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దామోదర్ రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరై సంతాప సభలో మాట్లాడిన సీఎం రేవంత్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం దామోదర్ రెడ్డి పేరు తెలివని వారు లేరన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు సూర్యాపేట నుండి ఒక సారి గెలుపొంది కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధుడన్నారు. ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్లగొండ జి ల్లా ప్రాంత ప్రజలను కాపాడడానికి గోదావరి జలాలను తుంగతుర్తి ప్రాంతానికి తీసుకు వచ్చిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి అని అన్నారు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామంలో జన్మించిన దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం అ త్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని అన్నారు. దివంగత నేత దామోదర్ రెడ్డి సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి అని, ఇద్దరు సోదరు లు జోడెడ్ల మాదిరిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలు అభివృద్ధి చెందాయంటే అది దామోదర్ రెడ్డి కృషివల్లనే అని అన్నారు. దామోదర్ రెడ్డి వేసిన కాంగ్రెస్ పార్టీ బీజాలు అత్యంత పటిష్టంగా ఉండడం వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని మందుల సామేల్ 50 వేల మెజారిటీతో గెలు పొందాడని ఆ ఘనత దామోదర్ రెడ్డిదేనని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన కాం గ్రెస్ పార్టీని గెలిపించడానికి దామోదర్ రెడ్డి ముందుండేవారిని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దామోదర్ రెడ్డి అని అభివర్ణించారు.
దామోదర్ రెడ్డి లేని లోటు కాంగ్రెస్ పార్టీలో తీర్చలేనిది అని కమిట్మెంట్ తో కూడిన గొప్ప నాయకుడు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి అని అన్నారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల ఏఐసాసా అగ్ర నాయకు లు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీలు, ప్రత్యేకంగా సంతాపం తెలిపారన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అన్ని విధాల అటు ఏఐసీసీ ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందన్నారు. అలాగే ఎన్నో ఉద్యమాలు చేసి తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకువచ్చిన అపర భగీరధులు దామోదర్ రెడ్డి పేరును ఎస్సారెస్పీ రెండవ దశ కాలువకు నామకరణం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రక టించారు .దామోదర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీని యర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డి, వి.హనుమంత రావు, దివంగత నేత దామోదర్ రెడ్డి తనయుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి లతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు





