Mahaa Daily Exclusive

  క్షమాపణలు చెప్పిన శ్రీకాంత్ అయ్యంగార్‌ ..గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

Share

హైదరాబాద్, మహా: మహాత్మా గాంధీపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం తాను పెట్టిన పోస్టు చాలామంది మనోభావాలను దెబ్బతీసిందని, వారందరికీ క్షమాపణలని పేర్కొన్నారు. శ్రీకాంత్‌ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆయనపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. శ్రీకాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌ సెల్‌ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఆదివారం ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. పబ్లిసిటీ కోసమే చరిత్రను ఆయన వక్రీకరించారని విమర్శించారు. గాంధీ సిద్ధాంతాన్ని నమ్మే వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. నటుడిపై ‘మా’ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ పెద్దలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించారు.

Latest