- చెంప పగుల్తది.. బట్టలూడదీసి కొడ్త
- బిజెపి స్టేట్ చీఫ్ ముందే బూతుపురాణం
- మాజీ ఎంపీ వెంకటేష్ నేతకాని వర్సెస్ గోమాస శ్రీనివాస్
హైదరాబాద్, మహా : బీజేపీ నేతల బూతుపురాణానికి స్టేట్ చీఫ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ముందే ఆ పార్టీ ముఖ్య నేతలు బూతుపురాణం అందుకున్నారు. మంచిర్యాల జిల్లా వేమన పల్లి మండలం నీల్వాయి గ్రామంలో ఆత్మహ త్య చేసుకున్న బీజేపీ నేత మధుకర్ కుటుంబా న్ని పరామర్శించేందుకు రాంచందర్ రావు వెళ్లారు. ఆయన పర్యటన సందర్భంగా బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ ఇన్ చార్జి గోమాస శ్రీనివాస్, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత కాని ని అరేయ్ వెంకటేశ్ అంటూ సం బోధించారు. దీంతో వెంటనే రియాక్టయిన వెంకటేశ్ అరేయ్ అంటే చెంప పగుల్తది.. అని సీరియస్ అయ్యారు. దానికి గోమాస శ్రీ నివాస్ బట్టలూడదీసి కొడ్తా అంటూ వెంకటేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్ నేతకాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. అందరూ కలిసి ఆయన భుజాలపై చేతులు వేసి కూ ర్చోబెట్టారు. రాంచందర్ రావు సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. నేతల మధ్య జరిగిన ఈ మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతటి నేతలైనా మీడియా ముందు నోరు జారితే చర్యలు తప్పవు అని రామచందర్ రావు ప్రకటించిన మరుసటి రోజు ఆయన కళ్ళముందే ఇద్దరు ముఖ్యనేతలు బూతుపురాణం అందుకున్న తీరు సంచలనంగా మారింది.






