Mahaa Daily Exclusive

  మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై వేటు ..తొలగిస్తున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఆర్డర్స్

Share

హైదరాబాద్‌, మహా: తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ ఎన్.సుమంత్‌పై వేటుపడింది. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుమంత్.. ఆమె ఓఎస్డీగా కొనసాగుతున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది కాల వ్యవధితో ఓఎస్డీగా 2023 డిసెంబర్ 17న సుమంత్ నియమితులయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది డిసెంబరు 16 వరకు కాంట్రాక్టు పొడిగించారు. పీసీబీ కాంట్రాక్టు ఉద్యోగిగా నియమితులై మంత్రి వద్ద ఓఎస్డీగా కొనసాగుతున్నారు. పాలనాపరమైన కారణాలతో సుమంత్‌ను తొలగిస్తున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోపణల నేపథ్యంలోనే సుమంత్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది.

Latest