హైదరాబాద్, మహా: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఈ మేరకు ఆహ్వానం పలికారు. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం గమనార్హం. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సదస్సు జరగనుంది. ఈ రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఈ రంగంలో అనుకూలతలు, అవకాశాలపై మాట్లాడనున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఆయనకు దక్కింది
Post Views: 57







