హైదరాబాద్, మహా: వీలైనంత త్వరగా అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయడానికి ఈ నెలాఖరు వరకు పాలసీ విధివిధానాలను కొలిక్కి తీసుకురావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడే విధంగా శాస్త్రీయ పద్ధతిలో అక్రిడిటేషన్ పాలసీ ఉండాలన్నారు. బుధవారం సచివాలయంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ సీహెచ్ ప్రియాంక, సీపీఆర్వో మల్సూర్‌తో కలిసి అక్రిడిటేషన్ పాలసీపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తుందని తెలిపారు. పాత్రికేయుల కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన జర్నలిస్టులకు అందేలా విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు
Post Views: 58







