- ప్రధాని మోదీ నేడు శ్రీశైలం క్షేత్రానికి
- తొలిసారి మల్లిఖార్జునుడి దర్శనానికి
- రూ.13,430 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు
కర్నూలు, మహా
భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని, అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ. 13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానితో పాటుగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సహా మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ప్రధాని హోదాలో తొలిసారి శ్రీశైలం వస్తున్న నేపథ్యంలో, ఆలయ అధికారులు, స్థానిక యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు
Post Views: 77







