- సదర్ ఉత్సవాలకు రండి..
- సీఎం రేవంత్ కు శ్రీకృష్ణ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆహ్వానం
- 19న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళన్
పల్లవి, మహా: హైదరాబాద్‌లో జరగనున్న సదర్ సమ్మేళనంలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ నెల 19వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళన్‌లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇతర ప్రతినిధులు ఉన్నారు.
రాష్ట్ర పండుగగా గుర్తింపు..
దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్ సమ్మేళన్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించింది తెలిసిన విషయమే. ఇక నుంచి యేటా సదర్ సమ్మేళన్‌ను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీపావళి పండుగ తర్వాత రోజున పశుపాలకులు దున్నపోతులను అలంకరించి ఆడుతూ-పాడుతూ సదర్ సమ్మేళన్ నిర్వహించడం తెలంగాణలో సంప్రదాయంగా వస్తోంది







