Mahaa Daily Exclusive

  పురపాలక సంఘం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న చైర్ పర్సన్ రాంబార్కి.శరత్ బాబు.

Share

విజయనగరం జిల్లా. మహా.
బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు బేబినాయన గారి ఆదేశాలతో,ఈ రోజు మున్సిపల్ చైర్ పర్సన్ రాంబార్కి శరత్ బాబు బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
బొబ్బిలి 17 వార్డు కౌన్సిలర్ బి. శ్రీదేవి దంపతులు,ఆ వార్డు పెద్దలు మరియు 18 వ వార్డు కౌన్సిలర్ బి. దమయంతి దంపతులు, ఆ వార్డు పెద్దలు అందరూ కలిసి సదరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు హాజరైన రాంబార్కి శరత్ బాబు చైర్ పర్సన్ గారికి దుశ్శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు.
8వ వార్డు – రత్నాలు నగర్ యందు బలిజిపేట మెయిన్ రోడ్డు నుండి వై. రంగారావు ఇంటి వరకు సీ.సీ డ్రైన్ మరియు కల్వర్ట్ నిర్మాణం చేయుటకు
అంచనా వ్యయం : 5:00 లక్షలు జనరల్ ఫండ్ నిధులు.
8 వ వార్డు :110 డి ఐ ఏ హెచ్ డి పి ఈ పైప్ లైన్ రాజులు సందు వద్ద వేయుటకు
అంచనా వ్యయం : 1.50 లక్షలు జనరల్ ఫండ్ నిధులు,
15 వార్డు: బొప్పడాపు వీధి
యందు జోగా అప్పారావు ఇంటి నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు సి.సి రోడ్డు నిర్మాణం చేయుటకు
అంచనా వ్యయం : 4.45 లక్షలు 15 ఫైనాన్స్ నిధులు.
17 వార్డు :గౌడు వీధి యందు గంగి అప్పలకొండ ఇంటి నుండి జమ్మి సుశీల ఇంటి వరకు డ్రైన్ నిర్మాణం చేయుటకు
అంచనా వ్యయం 3:00 లక్షలు15 ఫైనాన్స్ నిధులు. 18 వార్డు : డాక్టర్ అప్పారావు ఇంటి నుండి జంగాల శివాలయం వరకు డ్రైన్ నిర్మాణం చేయుటకు
అంచనా వ్యయం 4.95 లక్షలు సాధారణ నిధులు.
బొబ్బిలి పట్టణ అభివృద్దికి ఈ రోజు శంఖుస్థాపన చేసిన పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు మరియు సంబంధిత కాంట్రాక్టర్లు వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి,
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ కుమార్,
మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్స్
ఏ.ఎస్ కోటేశ్వరరావు మరియు వి.ఎస్.ఎన్ గుప్తా,
వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ చార్జ్‌లు, ఇతర వార్డు పెద్దలు మరియు టి.డి.పి నాయకులు హాజరు అయ్యారు..

Latest