Mahaa Daily Exclusive

  జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల18వ,తేదీన నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను జయప్రదం చెయ్యండి…

Share

విజయనగరం జిల్లా.మహా పత్రిక.
ఉపాధ్యాయులకు,విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు పి.సత్యంనాయుడు విజ్ఞప్తి చేశారు. బొబ్బిలి ఐటిడిఎ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్లను ఆ పాఠశాల ఉపాధ్యాయిని లతో కలిసి ఆవిష్కరించారు.
ప్రతి ఏటా పాఠశాల స్థాయి,మండల స్ధాయి,జిల్లా స్థాయి లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా లో వేలు సంఖ్య లో విద్యార్థులు పాల్గొంటున్నారని తెలియచేసారు.పాఠశాల స్ధాయిలో విజేతలు మండలం స్ధాయి కి ,ఆ స్ధాయి విజేతలు జిల్లా స్థాయి కి,ఆ స్ధాయి విజేతలు రాష్ట్ర స్థాయి లో పాల్గొంటారని తెలియచేసారు.విద్యార్ధులంతా శాస్త్రీయ దృక్పథం పెంపొందించే లక్ష్యంతో జరుగుతున్న చెకుముకి సైన్స్ సంబరాల ను వినియోగించుకోవాలని తెలిపారు

Latest