Mahaa Daily Exclusive

  ఆహార వృధాను అరికడదాం. ..కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు.

Share

విజయనగరం జిల్లా.మహా.
అన్నాన్ని దైవంగా భావించి ప్రతివారు ఆహార విషయం లో తగిన జాగర్తలు తీసుకుంటూఆహార వృధాను అరికట్టవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు అన్నారు. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవ నేపథ్యంలో గురువారం బొబ్బిలి పట్టణం కారుణ్య కార్యాలయం లో, గోడ పత్రికల ప్రదర్శన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ఆహారం లేక అల్లడిపోతుంటే మరోవైపు అధిక మొత్తంలో ఆహారం చెత్తబుట్ట పాలవుతుందన్నారు. వేడుకల్లో, హోటళ్లలో, రెస్టారెంట్లలో ఆహారం వృధా అవుతుందన్నారు. *మెరుగైన ఆహారం,మెరుగైన భవిష్యత్ కోసం చేయి చేయి కలుపుదాం అన్న నినాదంతో ఆహార వృధాను అరికట్టేందుకు నడుం బిగించాలన్నారు. ఆకలి కేకలు లేని ప్రపంచాన్ని నిర్మించాలంటే ఆహార వృధాను అరికట్టేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఆహారాన్ని వృధాగా పారబోస్తే ఆహారాన్ని పండించటానికి అవసరమైన నీరు, ఎ రువులు,విలువైన మానవ శ్రమ డబ్బు వృధా అవుతున్నాయన్నారు పాఠశాల దశనుండేవిద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. రెస్టారెంట్లలో,హోటళ్లలో,వేడుకల్లో మిగిలిన ఆహారాన్ని సేకరిచిఅవసరమైన వారికి అందించాలన్నారు. స్వచ్చంద సంస్థలకు ప్రభుత్వంతోడ్పాటు అందించాలని కోరారు. ఆహారహృదా పై సమాజానికి అవగాహన కల్పించిన్నప్పుడే ప్రయోజనం కలుగుతుందన్నారు.కార్యక్రమంలో కారుణ్య చీఫ్ ట్రస్టీ పి వి ఏ మెర్సీ రాజ్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సభ్యులు రామ కృష్ణ, అశోక్, చిన్నా రావు, రాజు తదితరులు పాల్గొన్నారు

Latest