Mahaa Daily Exclusive

  కార్మిక హక్కులను హరిస్తున్న మతోన్మాద ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కండి..

Share

విజయనగరం జిల్లా.మహా పత్రిక.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
పి కే ఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తమటాల అప్పలనాయుడు, రాయితీ సత్యం
కార్మిక వర్గం తమ రక్తాన్ని చిందించి ఎన్నో పోరాటాలు చేసి చికాగో కార్మిక వర్గ మృతివీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులు సాధించుకున్నారు దేశంలో రాష్ట్రంలో కార్మికులు తమ హక్కుల కోసం నిరంతరం పాలకవర్గాలతో పోరాటాలు చేస్తేనే ఉన్నారు కార్మిక చట్టాలు అమలు చేయకుండా నిరంతరం కార్మికుల అణికివేతకు గురిచేస్తూ కార్మికుల నరిస్తూనే ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ప్రకృతి శీల కార్మిక సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తమటాలు అప్పలనాయుడు, రాయితీ సత్యం పిలుపునిచ్చారు.
కేంద్రంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి కార్మిక చట్టాలు సవర్ణ పేరుతో 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లగా విభజించి కార్మిక జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. ఎనిమిది గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచుతూ కార్మిక జీవితాలతో చెలగాటమాడుతున్నారని తక్షణమే 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణం కామ్రేడ్ గంటి ప్రసాదం స్మారక భవనంలో కరపత్రాలను శీల కార్మిక సమైక్య అధ్యక్ష కార్యదర్శులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమైక్య నాయకులు దాసరి వెంకటరమణ, నల్లి తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Latest