విజయనగరం జిల్లా. మహా పత్రిక.
బొబ్బిలి పట్టణంలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ని బొబ్బిలి నియోజకవర్గం శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు బేబీ నాయన దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసినదే.
ఏ.పీ రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని ప్రత్యేక నిధులు కేటాయించవలసినదిగా కోరడం కూడా జరిగింది.
అలాగే, పాఠశాలలో విద్యా విధానం, మౌళిక సదుపాయాలను గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే బేబీనాయన సూచనల మేరకు బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యా రెడ్డి. ఈరోజు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ,విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణతో మెలగాలని అన్నారు.ప్రధానంగా విద్యార్థులు చెడుమార్గాల వైపు అడుగులు వేయరాదని,మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరించారు.ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం వారికి అందించిందని,ప్రతిఒక్కరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవిధంగా చదవాలని సూచించారు.అలాగే, ప్రిన్సిపల్ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని,బయటవారు ఇచ్చే ఆహారం తీసుకోవద్దని, వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫీడ్ బ్యాక్ పుస్తకం లో నమోదు చేయాలని సూచించారు.ఈరోజు నుంచి రెసిడెన్షియల్ స్కూల్ లో పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తానని, నైట్ పెట్రోలింగ్ వాహనం ప్రతిరోజు వచ్చి చెక్ చేస్తుందని అన్నారు.
రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,శాసనసభ్యులు బేబీ నాయన పాఠశాలపై చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు తెలిపారు. డీఎస్పీ తమ బిజీ షెడ్యూల్ లో సమయాన్ని కేటాయించి విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.







