Mahaa Daily Exclusive

  ‘డెక్కన్ సిమెంట్‘ ఇష్యూలో సంబంధం లేదు.. ఈ విషయంలో మౌనంగా ఉండదలుచుకున్నా…. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం

Share

హైదరాబాద్, మహా: డెక్కన్ సిమెంట్ కంపెనీ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీలోని కొందరు మంత్రుల మధ్య అంతర్గత ఘర్షణలకు దారి తీసింది. ఈ వివాదంపై కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. డెక్కన్ సిమెంట్ కంపెనీ వ్యవహారంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో తన ప్రమేయం గురించి వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఈ వివాదంపై మరింతగా మాట్లాడేది లేదని, ఈ విషయంలో మౌనంగా ఉండదలుచుకున్నానని ముక్తసరిగా తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలక విషయాన్ని ప్రస్తావించారు. “నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా చెప్పారు కదా?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్య ద్వారా, ఈ వివాదంలో తన నిస్సంబంధతను మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులే ధృవీకరించారనే పాయింట్‌ను ఆయన బలంగా చెప్పదలుచుకున్నారు. ఇతర మంత్రులతో కొండా సురేఖకు ఉన్న వివాదంలోకి తన పేరును లాగడాన్ని ఆయన పరోక్షంగా తోసిపుచ్చినట్లైంది

Latest