- స్థానిక ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- రెండు వారాల్లో తేదీలు చెబుతామన్న ప్రభుత్వం
హైదరాబాద్, మహా : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న చర్చోప చర్చలు కొట్టకేలకు హైకోర్టు మెట్లెక్కా యి. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్న పరిణామాలపై తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ దాఖలైంది. సుప్రీం కోర్టు ఈసీ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ను న్యాయవాది సురేందర్ వేశారు. దీనిపై శుక్రవారం విచారణలో బా గంగా న్యాయస్థానం వాదనలు విన్నది.ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్ని కల కమిషన్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహణపై సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం, ఈసీ కోరాయి. ఇందుకు అంగీకరించి రెండు వా రాల సమయం ఇస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ఆ జీవోపై స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టకుండానే అత్యున్నత న్యాయస్థానం సైతం రా ష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేయడంతో రిజర్వేషన్ల పంచాయితీ అగమ్యగోచరంగా మారింది. దీనితో స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకపోతే పార్టీ పరం గా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం విధితమే






