బంగారం ధర రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. సామాన్యులు అటువైపు కూడా చూడలేని పరిస్థితిలు నెలకొన్నాయి. అంతేకాకుండా సంపన్నులను సైతం బంగారం ధరలు వణికిస్తున్నాయి. దీపావళి పండుగ వరకే తులం బంగారం ధర లక్షన్నర అవుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో శుక్రవారం ఒక్కరోజే 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం రూ. 3300 లు పెరిగి 1,32,770 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం (తులం) 10 గ్రాముల ధర 3,050 రూపాయలు పెరిగి 1,21,700 రూపాయలకు చేరింది.
ఈ ధరలు హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.
రాబోయే రోజుల్లో తగ్గుతుందా..?
బంగారం ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతుండగా రాబోయే రోజుల్లో తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఆంక్షల వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని, ఆ తర్వాత ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. కానీ ఏదేమైనా ప్రస్తుతం మాత్రం బంగారం కొనలేని పరిస్థితిలు నెలకొన్నాయి







