హైదరాబాద్, మహా : బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు శనివారం నిర్వహించ తలపెట్టిన బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు
Post Views: 47







