Mahaa Daily Exclusive

  బంద్‌కు మద్దతిస్తూనే రాజకీయ డ్రామాలు..బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందన్న మహేశ్ కుమార్ గౌడ్

Share

  • బంద్‌కు మద్దతిస్తూనే రాజకీయ డ్రామాలు
  • 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు
  • బీసీ బిల్లు అడ్డుకునే వారెవరో అందరికీ తెలుసు: పీసీసీ చీఫ్
  • బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందన్న మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, మహా: బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను కూడా బంద్‌లో పాల్గొంటానని ఉద్ఘాటించారు. అయితే కొందరు ఈ బీసీ బిల్లును అడ్డుకుంటున్నారని, ఆ అడ్డుకునే వారెవరో అందరికీ తెలుసునని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఒకవైపు రిజర్వేషన్లు అడ్డుకుంటేనే మరొకవైపు బంద్‌కు మద్దతు ప్రకటించి రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని పీసీసీ చీఫ్ తెలిపారు. నేటి బంద్‌లో తాను కూడా పాల్గొంటానని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ బంద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలందరూ పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. బీసీ రిజర్వేషన్లను తెచ్చిందే తామని ఆయన గుర్తు చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. బీసీ బంద్ లో కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని ఉద్ఘాటించారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నతంగా ఆలోచించి ఈ బంద్‌లో పాల్గొంటున్నామని వివరించారు. బీజేపీ నేతలు ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేరని విమర్శించారు. రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు మళ్లీ వినిపిస్తామని, నేటి బంద్ ప్రజలను మేల్కొలపడానికి అన్నారు