- దండుకున్న దండుపాళ్యమే బీఆర్ఎస్
- క్యాబినెట్‌లో రాద్దాంతం జరిగిందని ఆయన నిరూపించగలరా?
- మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి సీతక్క సవాల్
హైదరాబాద్, మహా: బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటరిచ్చారు. క్యాబినెట్‌లో రాద్దాంతం జరిగిందని ఆయన నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. మంత్రులు గ్రూపులుగా విడిపోయారని, దంళుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా మారిందన్న హరీశ్ .. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘క్యాబినెట్లో ఎలాంటి రాద్దాంతం జరగలేదు. క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి ఆయన దిగజారిపోయారు. హరీశ్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. నిన్న వ్యక్తిగతంగా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం హరీశ్ రావు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే’ అని విమర్శించారు







