- ఒకేసారి భారత్, అఫ్గాన్‌తో యుద్ధానికి సిద్ధం
- మా వద్ద వ్యూహాలు ఉన్నాయి.. వాటి గురించి చర్చించ
- దాయాది రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోసారి బీరాలు
ఇంటర్నెట్ డెస్క్, మహా: భారత్‌పై పాకిస్థాన్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేసింది. అఫ్గానిస్థాన్ మనకు దగ్గరవడం జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కుతోంది. సరిహద్దు వెంట భారత్ డర్టీ గేమ్స్ ఆడేందుకు అవకాశాలున్నాయని దాయాది రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. తాలిబన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఖ్వాజా ఆసిఫ్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్‌తో కూడా సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైతే ఎలా? అని మంత్రికి ప్రశ్న ఎదురుకాగా… ‘‘అవును.. దానిని కొట్టిపారేయలేం. ద్విముఖ యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉంది. అందుకు మా వద్ద వ్యూహాలు ఉన్నాయి. వాటి గురించి నేను చర్చించను’’ అని చెప్పారు. అప్పుడే భారత్ గురించి నోరుపారేసుకున్నారు. అలాగే తమ దేశంలో నివసిస్తోన్న అఫ్గాన్ శరణార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘వారివల్ల పాక్‌కు ఎలాంటి ఉపయోగం లేకపోగా.. వారు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. పాక్‌లో అక్రమంగా నివసిస్తోన్న వారిని గుర్తిస్తున్నాం. వారు వెంటనే మా దేశాన్ని వీడాలి’’ అని వ్యాఖ్యలు చేశారు







