- తడిబట్టలతో ప్రమాణం చేద్దామా?
- సవాల్‌కు సిద్ధంగా ఉంటే డేట్, టైమ్ ఫిక్స్ చేయ్
- మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్
హైదరాబాద్, మహా: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చలపై హరీశ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తడిబట్టలతో కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరి తన వ్యాఖ్యలకు హరీశ్ రావు కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో సిద్ధిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తడిబట్టలతో వచ్చి నా తల్లిదండ్రులపై ఒట్టేసి మరి ప్రమాణం చేస్తానని మరి తను ప్రమానం చేయడానికి హరీశ్ రావు సిద్ధమేనా అని చాలెంజ్ చేశారు. ఈ సవాల్ కు సిద్ధంగా ఉంటే హరీశ్ రావే డేట్, టైమ్ ఫిక్స్ చేయాలన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీపై హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని, కేబినెట్ మీటింగ్‌లో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ సెటిల్ మెంట్లు, కమీషన్లు, దోచుకోవడం, దాచుకోవడం స్వయంగా కేసీఆర్ బిడ్డ, మీ బంధువు కవితే చెప్పారని ముందు కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని కౌంటర్ వేశారు. 2004 లో హరీశ్ రావు ఆస్తులెంతా ఇప్పుడు మీ ఆస్తులెంతో చెప్పాలన్నారు








