- నవీన్ఆల్ ది బెస్ట్..
- బి. ఫామ్ అందజేసిన పీసీసీ చీఫ్
- నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్‌కు ఆ పార్టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బి.ఫామ్ అందజేశారు. ఆదివారం నర్సింగ్‌లోని తన నివాసంలో నవీన్ యాదవ్‌కు పీసీసీ చీఫ్ అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నవీన్‌కు మహేశ్ కుమార్ గౌడ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రహమత్నగర్ కార్పొరేటర్సీఎన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న తీరుతెన్నులు, చేపట్టవలసిన కార్యక్రమాలపై సూచనలు చేయడంతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు
Post Views: 44








