Mahaa Daily Exclusive

  @89,344 అప్లికేషన్స్.. 2620 మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు..

Share

  • @89,344 అప్లికేషన్స్..
  • 2620 మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
  • మరో మూడ్రోజుల గడువు పొడిగించిన ఎక్సైజ్ శాఖ
  • సర్కార్‌కు దాదాపు రూ. . 24 వందల కోట్ల ఆదాయం.. 27న లక్కీ డ్రా

హైదరాబాద్, మహా: (2025-27) కొత్త మద్యం పాలసీ కోసం రాష్ట్రంలో ఉన్న 2620 మద్యం షాపులకు 89,344 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మద్యం షాపులకు నిర్వహణకు సంబంధించి శనివారం వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. దరఖాస్తుల స్వీకరణ ఆఖరు రోజు ఓబీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ పిలుపునివ్వడంతో గడువు పెంపుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా ఆఖరి రోజు 50 వేల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 27న లక్కీ డ్రా..
ఈ వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం దరఖాస్తుల తుది గడువును అక్టోబర్ 23 వరకు పెంచింది. ఈ గడువు పెంపు కారణంగా.. వాస్తవానికి ఈ నెల 23న జరగాల్సిన లక్కీ డ్రా కార్యక్రమాన్ని కూడా అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. ఈ వివరాలను ఎక్సైజ్‌ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. కొత్త మద్యం పాలసీ (2025-27) కోసం గత నెల 26న దరఖాస్తుల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం వరకు సుమారు 50 వేల దరఖాస్తులు రాగా.. తుది గడువు రోజు అయిన శనివారం ఒక్క రోజే రాత్రి 11 గంటల వరకు మరో 37 వేలకు పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు అంచనా వేశారు.

Latest