అయోధ్య, మహా: అయోధ్య నగరం దీపకాంతులతో వెలిగిపోతోంది. 9వ దీపోత్సవంలో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి ఈ ఏడాది 26.17 లక్షల దీపాలు వెలిగించారు. అదేవిధంగా ఏకకాలంలో 2,128 మందితో హారతి నిర్వహించారు. ఈ రెండూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. పెద్దఎత్తున భక్తులతో నదీ తీరంలోని ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. రామ్లీలా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్ కీ పైడీ ఘాట్లో ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హారతి నిర్వహించారు. అంతకుముందు అయోధ్య రామమందిరంలో పూజలు నిర్వహించారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఆశీనులైన రథాన్ని లాగారు. అనంతరం దీపాన్ని వెలిగించి.. వేడుకలను ప్రారంభించారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Post Views: 71








