Mahaa Daily Exclusive

  చెక్ పోస్ట్‌ల మాటున బీఆర్ఎస్ పాపాల పుట్టలా అవినీతి…కీలక విషయాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Share

  • చెక్ పోస్ట్‌ల మాటున బీఆర్ఎస్ పాపాల పుట్టలా అవినీతి
  • బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం
  • వాహన్, సారథిలో 28 రాష్ట్రాలు ఉన్నా పదేళ్లలో తెలంగాణ చేరలేదు
  • చెక్ పోస్టులు రద్దు చేసినా అక్రమ రవాణా జరగకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్కువగా చేస్తాం
  • కీలక విషయాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మహా: మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెక్ పోస్ట్‌ల మాటున గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే వాహన్, సారథిలో 28 రాష్ట్రాలు ఉన్నాయని, పదేళ్లలో తెలంగాణ ఎందుకు చేరలేదు? అని పొన్నం ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం అనేక అంశాలపై మాట్లాడారు. ‘తెలంగాణలో చెక్ పోస్టులు రద్దు బుధవారం నుంచి అమలు చేస్తూ జీవో జారీ చేశాం. చెక్ పోస్టుల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి చర్యలు చేపడతాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా ఆన్ లైన్ లో జరగడానికి చర్యలు చేపట్టాం. చెక్ పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకొని.. బుధవారం నుంచి అమలు చేస్తున్నాం. తెలంగాణలో ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత రూ.577కోట్ల ట్యాక్స్ ప్రభుత్వం మినహాయించింది. ఈవీ వెహికిల్ అమ్మకాల షేర్ 0.03 నుంచి 1.13 శాతానికి పెరిగింది. ఇప్పుడు మేము వాహన్, సారథిలో చేరాం. డేటా ట్రాన్స్‌ఫార్మింగ్ జరుగుతోంది. వాహన్ అమలు చేస్తున్నాం.. సారథి అమలు చేస్తాం.. చెక్ పోస్టులు రద్దు చేసినా వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్కువగా చేస్తాం’ అని పొన్నం చెప్పారు.

ఢిల్లీ పొల్యూషన్ పరిస్థితి ఇక్కడ లేకుండా ఉండడానికి ‘ఈవీ’ పాలసీ తీసుకొచ్చాం. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు 10 వేలు చొప్పున అనుమతి ఇచ్చాం. 25 వేల రేటిరో ఫిటింగ్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. రాష్ట్రంలో ‘వాహన్’ అమలవుతోంది. ‘సారథి’ త్వరలోనే తీసుకొస్తాం. ‘స్క్రాపింగ్ పాలసీ’ తీసుకొచ్చాం. వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చాం. ఏఐ టెక్నాలజీను ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో రికార్డ్ చేస్తూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని నోట్ చేసి.. హెడ్ ఆఫీస్ కి అలెర్ట్ చేస్తుంది. అలాంటి వాటిని నిరోధించడానికి ఏఐ ఉపయోగిస్తున్నాం. వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. టూరిజం వెహికల్స్ డబుల్ నెంబర్ ప్లేట్ తో పోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నాం. రోడ్ సేఫ్టీ క్లబ్స్ ద్వారా.. జూనియర్, డిగ్రీ, ఇతర కాలేజీలలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నాం.

రాష్ట్రంలో1.7 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పాత వాహనాలు, డబుల్ నంబరింగ్ అరికట్టడానికి మైనింగ్, ఇతర వాహనాలను మొదటి దశలో చూస్తున్నాం. రవాణా శాఖలోని 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖ, ఆర్టీసీ, ఇతర విభాగాలలోని పాత వాహనాలను స్క్రాప్ కి పంపించాలని లేఖ రాశాం. చెక్ పోస్టులను రద్దు చేయాలని నేనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కేబినెట్ లో పెట్టడం జరిగింది. వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. చెక్ పోస్టులు రద్దు చేసిన తరుణంలో వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేస్తాం.’ అని మంత్రి పొన్నం వెల్లడించారు

Latest