- జూబ్లీహిల్స్ ప్రచారంలో నవీన్ యాదవ్ జోరు
- భారీ మెజారిటీతో విజయం తథ్యం- మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ , యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి అయిలం కాలనీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు అండగా నిలిచే నవీన్ యాదవ్ ను ప్రజలే గెలిపించుకుంటారు అని మంత్రి పొన్నం అన్నారు. ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు మంజూరు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. మహిళలతో , వ్యాపారస్తులతో ముచ్చటించారు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నీ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సంపత్ కుమార్ , ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య, శివసేన రెడ్డి ,బెల్లయ్య నాయక్ , గిరిధర్ రెడ్డి,ఇతర ముఖ్య నేతలు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు







