Mahaa Daily Exclusive

  టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల …..ఈ నెల 30 నుంచి నవంబర్‌ 13 లోపు చెల్లింపుకు గడువు…

Share

హైదరాబాద్, మహా: తెలంగాణలో పదో తరగతి ఫైనల్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించింది. అక్టోబరు 30వ తేదీ నుంచి నవంబర్‌ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపింది. హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18 లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 29 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీవరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు