Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. 14న మాట్లాడుకుందాం..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Share

  • జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. 14న మాట్లాడుకుందాం
  • శంకరాహిల్స్‌లో రేవంత్ ఏం చేస్తున్నారో తెలుసు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. నవంబర్ 14న మాట్లాడుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో ఐఏఎస్ అధికారి రిజ్వీ బలి అయ్యారని చెప్పారు. రూ.500 కోట్ల టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ వచ్చిందని ఆరోపించారు. మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు, మంత్రి కొండా కుటుంబం మధ్య గొడవ జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. శంకరాహిల్స్ లో రేవంత్ ఏం చేస్తున్నారో, సర్వే నంబర్ 83లో ఏం చేయాబోతున్నారో అన్నీ తమకు తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల విషయంలో గొడవలతో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు. తన మాట వినలేదని.. మంచి అధికారి మీద మంత్రి జూపల్లి కక్ష తీర్చుకుంటున్నాడని ఆరోపించారు.

ఖాకీ బుక్ ఎక్కడో డీజీపీ చెప్పాలి..
తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని మండియపడ్డారు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పిందని తెలిపారు. తుపాకీ ఇచ్చింది రేవంత్.. పెట్టింది రోహిణ్ రెడ్డి అని మంత్రి కొండా కుమార్తె చెప్తుందన్నారు. మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపటం లేదో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి? అనిప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కు సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై ఉత్తమ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలన్నారు. పింక్ బుక్, రెడ్ బుక్ లేదు.. ఖాకీ బుక్ మాత్రమే ఉందని శివధర్ రెడ్డి అన్నారని.. ఆ ఖాకీ బుక్ ఎక్కడో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ది ఇల్లునా.. సెటిల్మెంట్ కు అడ్డానా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు