Mahaa Daily Exclusive

  అర డజను పిల్లలతో సంతోషంగా ఉండు ….ప్రభాస్ కు మోహన్ బాబు విషెస్

Share

హైదరాబాద్, మహా
రెబెల్ స్టార్ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన బర్త్‌డే విషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోహన్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “మై డియర్ డార్లింగ్ బావా”.. “నువ్వు సినీ జాతి మొత్తానికి ఒక గర్వకారణం,” అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి మోహన్ బాబు ఫన్నీగా ప్రస్తావించారు. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని, నీకు అరడజన్ నుంచి ఏకంగా ఒక డజన్ మంది పిల్లలు కూడా కలగాలని.. సంతోషమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఈ బావ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు” అని పేర్కొన్నారు. మోహన్ బాబు చేసిన ఈ సరదా వ్యాఖ్యలు నెట్టింట ఫన్నీ కామెంట్స్‌కు దారి తీశాయి.