Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ పార్టీ:ఎమ్మెల్యే మందుల సామేలు

Share

  • బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ పార్టీ
  • కేసీఆర్ కుటుంబం రూ.8లక్షల కోట్లు దోచుకుంది
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

హైదరాబాద్, మహా : బీఆర్ఎస్ పార్టీపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే బొందల గడ్డ పార్టీ అని అన్నారు. తెలంగాణతో కేటీఆర్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసలు తెలంగాణ ఉద్యమం గురించి కేటీఆర్‌కు తెలుసా? కాంగ్రెస్ మంత్రివర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నాడు.. అసలు బీఆర్ఎస్ పార్టీనే దొంగల పాళ్యం పార్టీ అని విమర్శించారు. కేటీఆర్‌ను నాయకుడిగా ప్రజలు ఇంకా గుర్తించట్లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందాలో ఉన్నారు, భూ మాఫియాలో ఉన్నారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేశామని రూ.8 లక్షల కోట్లు దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ముందు కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాజకీయం కోసం సొంత కుటుంబసభ్యురాలిని బయటకు బయటకు గెంటేసిన మీరు నీతులు చెబితే మేము వినాలా? అని సీరియస్ అయ్యారు.

Latest