హైదరాబాద్, మహా: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ ‘పెట్ అండ్ ప్లే పార్క్’ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో పార్క్ వద్ద ఆగి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. చెత్తా చెదారంతో నిండిన ఆ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా, పార్క్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి గతంలో జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పార్క్లో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి ఆకస్మికంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పార్క్లో పనిచేస్తున్న కూలీలకు ఆప్యాయంగా పలకరించారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు
Post Views: 48







