Mahaa Daily Exclusive

  మంటల మధ్య ఆరుగురి ప్రాణాలు కాపాడాడు

Share

  • రియల్‌ హీరో.. శభాష్‌ రమేష్‌
  • మంటల మధ్య ఆరుగురి ప్రాణాలు కాపాడాడు
  • అతనిపై ప్రసంశలు కురిపిస్తున్న జనం

కర్నూల్, మహా: కర్నూల్ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రమేష్‌ అనే వ్యక్తి తన తోటి ఆరుగురు ప్రయాణికుల్ని ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రమాద సమయంలో బస్సులో మంటలు చెలరేగి, చుట్టూ వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బస్సులో చిక్కుకుపోయారు. బయట నుంచి సహాయం అందించేందుకు వీలుకాలేదు. అప్పుడే నేనున్నాంటూ బస్సులో రమేష్‌ అనే ప్రయాణికుడు ప్రాణాలకు తెగించాడు. బస్సు అద్దం పగలగొట్టి తనతో పాటు మరో ఆరుగురిని బయటకు రప్పించాడు. ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన సమయంలో హిందూపురం నుంచి నంద్యాలకు వెళ్తున్న ప్రత్యక్ష సాక్షి.. మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో నేను హిందూపురం నుంచి నంద్యాలకు నా కారులో వెళ్తున్నా. అద్దలు పగలగొట్టుకుని బయటకు వస్తున్న ఆరుగురు ప్రయాణికుల్ని నా కారులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా. మంటలు వ్యాపిస్తుంటే బస్సు లోపల రమేష్‌ అనే వ్యక్తి అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడారు. ఆస్పత్రికి చికిత్స పొందుతున్న రమేష్‌తో పాటు మిగిలిన ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. బస్సు చుట్టూ మంటలు అంటుకున్నాయి. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు.. బయట నుంచి బస్సు లోపలికి వెళ్లి ప్రయాణికుల్ని కాపాడేందుకు వీలు లేదు’ అని పేర్కొన్నారు.