కర్నూలు, మహా: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. గొల్ల రమేశ్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గొల్ల రమేశ్ (35), ఆయన భార్య అనూష (30), కుమార్తె మన్విత (10), కుమారుడు మనీశ్ (12) మృతి చెందారు. అయితే ఇటీవల, రమేష్ తన కుటుంబంతో హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం వారిని బలి తీసుకుంది. మొత్తం ఫ్యామిలీ మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి
Post Views: 54







