- సర్కార్‌కు టెండర్ల కిక్కు!
- మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
- 95 వేల అప్లికేషన్లతో సర్కార్‌కు రూ.2,854 కోట్ల ఆమ్దాని
- అప్లికేషన్లు రంగారెడ్డి డివిజన్‌లో అత్యధికం.. అత్యల్పంగా ఆదిలాబాద్
హైదరాబాద్, మహా: రాష్ట్ర ప్రభుత్వానికి వెన్స్ టెండర్లు కాసుల పంట పండించాయి. (23) గురువారంతో మద్యం దుకాణాలను దరఖాస్తులు సమయం ముగియడంతో శుక్రవారం ఎక్సెజ్ అధికారులు వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని 2,620 మద్యం షాపులకు 95, 137 దరఖాస్తులు వచ్చాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.2,854 కోట్ల మేర ఆదాయం లభించింది. గత ఏడాది రూ.2,640 కోట్లు ఆదాయం రాగా.. ఈ సారి మరో రూ.200 కోట్ల మేర పెరిగింది. అయితే, దరఖాస్తులకు నిన్న చివరి రోజు కావడంతో 4,82 దరఖాస్తులు వచ్చాయి. ఓబీసీ బంద్ తో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు నడవకపోవడం, కొన్నిచోట్ల బ్యాంకులు పనిచేయకపోవడం వంటి పరిస్థితులను దృష్టి ఉంచుకొని ఎక్సెజ్ శాఖ మద్యం షాపులకు దరఖాస్తుల గడవును శుక్రవారంతో వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా, అత్యధికంగా రంగారెడ్డి డివిజన్లో 29,420 రాగా, అతి తక్కువగా ఆదిలాబాద్ డివిజన్లో 4,154 అప్లికేషన్లు వచ్చాయి.
జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు..
=అదిలాబాద్ – 771
=కోమురం భీమ్ అసిఫాబాద్ – 680
=మంచిర్యాల్ – 1712
=నిర్మల్ – 991
=హైదరాబాద్ – 3201
=సికింద్రాబాద్ – 3022
=జగిత్యాల – 1966
=కరీంనగర్ – 2730
=పెద్దపల్లి – 1507
=రాజన్న సిరిసిల్ల – 1381
=ఖమ్మం – 4430
= కొత్తగూడెం – 3922
=జోగులాంబ గద్వాల – 774
=మహబూబ్‌నగర్ – 2487
=నాగర్‌కర్నూల్ – 1518
=వనపర్తి – 757
=మెదక్ – 1420
=సంగారెడ్డి – 4432
=సిద్దిపేట్ – 2782
=నల్లగొండ – 4906
=సూర్యపేట్ – 2771
=యాదాద్రి భువనగిరి – 2776
=కామారెడ్డి – 1502
=నిజామాబాద్ – 2786
=మల్కాజిగిరి – 5168
=మేడ్చల్ – 6063
=సరూర్‌నగర్ – 7845
=శంషాబాద్ – 8536
=వికారాబాద్ – 1808
=జనగామ – 1697
=జయశంకర్ భూపాలపల్లి – 1863
=మహబూబాబాద్ – 1800
=వరంగల్ రూరల్ – 1958
=వరంగల్ అర్బన్ – 317







