Mahaa Daily Exclusive

  మేము రెడీ.. నువ్వు సిద్ధమా?సిద్దిపేటలో హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి ఛాలెంజ్

Share

  • మేము రెడీ.. నువ్వు సిద్ధమా?
  • పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనపై చర్చిద్దాం
  • హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తాం.. మీరు?
  • సిద్దిపేటలో హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి ఛాలెంజ్

సిద్దిపేట, మహా: కేబినెట్ సమావేశాన్ని హరీష్ రావు దండుపాళ్యం బ్యాచ్ అనడం బాధాకరామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేటలో శనివారం మీడియాతో మాట్లాడుతూ..ఉద్యమ నాయకుడు ఇలా అనడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు మంత్రిగా పని చేశారని.. ఆ విషయం హరీష్ మరవద్దని అన్నారు. మంత్రి వర్గంలో ప్రజలకు అవసరం అయ్యో మీటింగ్ తప్ప.. దండుపాళ్యం లాగా దోచుకోవడం కోసం మీటింగ్ పెట్టలేదని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అలా అనడం బాధాకరమన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేతో తనను తిట్టించడం దారుణమని మండిపడ్డారు. హరీష్ భజన మండలితో తనను తిట్టించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలంగాణా ఏర్పాటులో తాము కూడా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఇంతగా టార్గెట్ చేయడం ఏంటని సీరియస్ అయ్యారు.

ఆస్తులు, ఫామ్ హౌస్‌లు కాదు.. ఆత్మగౌరవం ముఖ్యం
2014 బీఆర్‌ఎస్ హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి, ఇంటి కో ఉద్యోగం లాంటి హామీలు ఏమయ్యాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రిని ఏకవచనంతో మాట్లాడటం ఏంటంటూ ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్క నియామక పత్రం ఇచ్చారా అని అడిగారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులకు మిత్తీలు కట్టుకుంటూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలును నేరవేర్చక పొతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలన, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ‘హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము వస్తాం మీరు వస్తారా’ అంటూ ఛాలెంజ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను కేంద్రం ఎందుకు అమలు చేయడంలేదో రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘నేను వివాదం చేయడానికి ఇక్కడికి రాలేదు. మాకు ఆస్తులు, ఫామ్ హౌస్‌లు కాదు మా దళితులకు ఆత్మగౌరవం ముఖ్యం. జూబ్లీహిల్స్, గ్రామస్తాయి ఎన్నికలు ఉన్నాయ్ అందులో ప్రజలు ఎవరికీ బ్రహ్మరథం పడుతారో చూద్దాం’ అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు

Latest