Mahaa Daily Exclusive

  ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు..ఇంటర్‌ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

Share

  • ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
  • 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో మార్పులు
  • ఇంటర్‌ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

హైదరాబాద్, మహా: తెలంగాణలో ఇంటర్-2025 పరీక్షల తేదీ ఖరారు అయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ సిలబస్‌లోనూ మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో ఫస్ట్ ఇయర్‌లో కూడా ల్యాబ్స్‌, ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ ఉండనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలతో పాటు ప్రాక్టికల్స్, పరీక్షల్లో చేస్తున్న మార్పులపై ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పలు వివరాలను వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 12 సంవత్సరాల తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బోటనీ, జువాలాజీలో సిలబస్ లో మార్పులు జరిగాయని ప్రకటించారు. హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్ ఏప్రిల్ మొదటి వారంలో బుక్స్ అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు

Latest