Mahaa Daily Exclusive

  ప్రెస్ క్లబ్ ఎన్నికపై ఉత్కంఠ..

Share

  • ప్రెస్ క్లబ్ ఎన్నికపై ఉత్కంఠ
  • బరిలో సీనియర్లు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బరిలో గడ్డం క్రిష్ణమూర్తి
  • సీరియల్ నెంబర్ 10పై పోటీచేస్తున్న గడ్డం క్రిష్ణమూర్తి
  • సీరియల్ నెంబర్ 4పై ఎఎన్ఎన్ సినిమా పాత్రికేయుడు అశోక్ దయ్యాల

నేడు ఎన్నిక

హైదరాబాద్, మహా
ప్రెస్ క్లబ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఆదివారం జ‌ర‌గ‌నున్న హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎక్కువమంది సీనియర్ పాత్రికేయులు ఉన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వేయిమందికి పైగా ఓటర్లున్నారు. మ‌న జ‌ర్నలిస్టు మిత్రుల కోసం నేనున్నానంటూ.. తొలిసారి సీనియర్ పాత్రికేయుడు ఎఎన్ఎన్ బ్యూరో చీఫ్ గడ్డం క్రిష్ణమూర్తి బరిలో నిలిచారు. నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా ఉన్న క్రిష్ణమూర్తి తొలిసారి ఎగ్జిక్యూటివ్ గా పోటీలో ఉన్నారు. ఆంధ్రప్రభతో పాటు వివిధ పత్రికల్లో పనిచేసి తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఇక సినిమా పాత్రికేయుడిగా అందరికీ తలలో నాలుకగా ఉన్న అశోక్ దయ్యాల గత ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్వల్ప తేడాతో ఓడగా, ఈసారి విజయం ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది. మార్పు కోసం, మంచి కోసం కదిలిన ఎఎన్ఎన్ జర్నలిస్టులకు సీనియర్ పాత్రికేయులు ఓటర్ల నుండి అనూహ్య మద్దతు లభిస్తోంది. అందరితో మంచిగా ఉండే ఇద్దరూ విజయం సాధించాలని ప్రెస్ క్లబ్ మార్పు కోరేవారు, మంచి కోరే వారు కోరుకుంటున్నారు.
….

Latest