Mahaa Daily Exclusive

  ఎంటీఏఆర్ కార్మిక ఎన్నికలో బీఆర్ఎస్ విజయం :ఎంపీ రఘునందన్ రావుపై శ్రీనివాస్ గౌడ్ విక్టరీ

Share

హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లో బాలానగర్‌లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెట్ కంపెనీలో బీఆర్ఎస్ నుంచి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై గెలుపొందారు. ప్రత్యర్థి రఘునందన్ రావుని ఓడించి, భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంటీఏఆర్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మనెంట్ చేసి, కార్మికులకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కార్మికులకు బేసిక్‌ను 30 శాతం నుండి 50 శాతానికి పెంచడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా. ఈ కార్యక్రమంలో ఎంటీఏఆర్ కంపెనీ బీఆర్టీయూ యూనియన్ జనరల్ సెక్రటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్‌లు వెంకటేశ్వర రెడ్డి, సమ్మయ్య, రాయుడు యాదవ్ తదితరులు ఉన్నారు

Latest