Mahaa Daily Exclusive

  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో తప్పులకు తావు ఉండకూడదు:సీఈవో సుదర్శన్ రెడ్డి

Share

  • స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో తప్పులకు తావు ఉండకూడదు:సీఈవో సుదర్శన్ రెడ్డి
  • స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష సమావేశం
  • రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు

మెదక్ , మహా

జిల్లాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు- ఎన్నికల అధికారులు, ఈ ఆర్ ఓ లతో  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఇందులో కేటగిరీ ఏ లో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ B లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ C లో 1987 నుంచి 2002 మద్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ D లో 2002-2007 మధ్యలో జన్మించిన వారిగా విభజించడం జరిగిందని తెలిపారు. అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరి ఏ జాబితాను బి ఎల్ ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో నమోదు చేయబడుతుందని తెలిపారు. అనంతరం కేటగిరి సీ, క్యాటగిరి డీ లలోని ఓటర్లను కేటగిరి ఏ కు మ్యాపింగ్ చేయాలని, ఈ ప్రక్రియను ఎ ఈ ఆర్ఆ ఓ ల ఆధ్వర్యంలో బి ఎల్ ఓ సూపర్ వైజర్లు, బి ఎల్ ఓ లు బి ఎల్ ఓ యాప్ ద్వారా వచ్చే శనివారం నాటికి పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ….స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా… దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ వీసీ లో అదనపు కలెక్టర్ నగేష్ లోమ్, ఆర్డీ వో లు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ లు, కలెక్టరెట్ సూపరిండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Latest