Mahaa Daily Exclusive

  కంది శ్రీ‌నివాస రెడ్డి బావ‌మ‌రిది అఖిల్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం..

Share

  • కంది శ్రీ‌నివాస రెడ్డి బావ‌మ‌రిది అఖిల్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం
  • చిన్న వ‌య‌సులో గుండె పోటుతో క‌న్నుమూసిన యువ‌కుడు
  • గుండెల‌విసేలా రోదించిన కుటుంబ స‌భ్యులు, మిత్రులు
  • స్వ‌స్థ‌లం బేల మండ‌లం సిర్స‌న్న‌లో ముగిసిన అంత్య‌క్రియ‌లు
  • వేలాది మందితో కిక్కిరిసిస‌న గ్రామం

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయ‌న‌ బావమరిది గడ్డం అఖిల్ రెడ్డి (28) గుండె పోటుతో మృతి చెందారు. ఇప్పుప్పుడిప్పుడే బావ అడుగు జాడ‌ల్లో ఎదుగుతూ ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌లు ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ ఎంతో భ‌విష్య‌త్ ఉన్న అఖిల్ రెడ్డి ఆక‌స్మికంగా క‌న్నుమూసారు. ఉదయం గుండెపోటుతో ప్రైవేట్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన అఖిల్, చికిత్స పొందుతూనే ఆకాల మరణం చెందారు. దీంతో ఇరుకుటుంబాల‌తో పాటు ఆయ‌న స‌న్నిహితులు మిత్రులు కంది శ్రీ‌నివాస రెడ్డి అభిమానులు కాంగ్రెస్ శ్రేణులతో పాటు స్వ‌గ్రామం సిర్స‌న్న‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. నివాసం వ‌ద్ద కడసారి అఖిల్ రెడ్డి భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించేందుకు
బంధువులు, మిత్రులు కాంగ్రెస్ శ్రేణులతో పాటు పట్టణ ప్రముఖులు, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీల నేతలు పెద్ద సంఖ్య‌లో తరలివచ్చారు. వేలాదిమంది అశ్రున‌య‌నాల మ‌ధ్య అఖిల్ రెడ్డి అంతిమ‌యాత్ర
సాగింది. అఖిల్ రెడ్డి తండ్రి ర‌మేష్ రెడ్డి చితికి నిప్పంటించారు. ఇక సెల‌వ్ ..అంటే అంద‌రూ క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు

Latest