Mahaa Daily Exclusive

  రాష్ట్రమంతా తిరిగినా కవితకు 400 ఓట్లు రావు: ఎంపీ ధర్మపురి అర్వింద్

Share

  • రాష్ట్రమంతా తిరిగినా కవితకు 400 ఓట్లు కూడా రావు
  • ఉద్యమకారులకు ఏం చేశారని కేసీఆర్‌ను అడుగు
  • అక్రమంగా సంపాధించిన సొమ్ముతో న్యాయం చేయండి
  • బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ‘జాగృతి జనం బాట’పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రమంతా తిరిగినా కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదో ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కవిత అడగాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా సంపాధించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. నాలుగు సంవత్సరాలు కాదు కదా నాలుగు జన్మలెత్తినా ప్రజలు కవితకు ఓట్లు వేయరన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా కవితను ఎవరూ పట్టించుకోరని, కేసీఆర్ ఫోటోతోనే కవిత తన జీవితంలో ఒక్క సారి ఎంపీ అయ్యారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడగాలన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతోంది అనేది చెప్పగలను కానీ జూబ్లీహిల్స్ నేనెట్లా చెప్పగలనని వ్యాఖ్యానించారు.

Latest