Mahaa Daily Exclusive

  తుపాన్ ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ .. మంత్రి ఉత్తమ్ కీలక సమీక్ష..

Share

హైదరాబాద్, మహా
మొంథా తుఫాన్ ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం గురించి చర్చ జరిగింది. అలాగే తుఫాన్ ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. టార్పాలిన్‌లను వినియోగించి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటిల్లో ఇప్పటికే 4,428 కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. మిగిలినవి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 22, 433 మంది రైతుల నుంచి 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ దాదాపు రూ. 431.09 కోట్లు అని, ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Latest