Mahaa Daily Exclusive

  ఆంధ్రాకు వెళ్ళొద్దు మొంథా.. అలర్ట్..43 రైళ్లు రద్దు.. మూడురోజులు భీభత్సమే

Share

హైదరాబాద్, మహా

మొంథా తుపాన్ ఆంధ్రా వైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వేశాఖ అలర్ట్ అయ్యింది. తుపాన్ కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విశాఖ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, ఎల్టీటీతోపాటు పలు ప్రధాన రైళ్లు, పలు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు అంటే అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విశాఖ మీదుగా సాగే రైల్వే సర్వీసులు రద్దయ్యాయి

Latest