Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ ఐదు ముక్కలు మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Share

  • బీఆర్ఎస్ ఐదు ముక్కలు
  • మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని కవితే సూచిస్తున్నారు

జూబ్లీహిల్స్, మహా
కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోష్ రావు దోచుకున్నారని, కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని స్వయంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. “కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో… రామన్నా జాగ్రత్త” అని కవితనే హెచ్చరించారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఐదు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి తగిన వ్యక్తి కాదని విమర్శించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన గుంటూరులో ఇంకా చదువుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయని కేటీఆర్ గురించి మాట్లాడటం అనవసరమని అన్నారు

Latest