- డిసిసి పదవిలో మున్నూరు కాపులకు సమచిత స్థానం కల్పించాలి…
- పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి వినతి పత్రాన్ని అందజేసిన మున్నూరు కాపు నేతలు
హైదరాబాద్, మహా: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి బీసీ లకు కేటాయించాలని కోరుతూ మంగళవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి మున్నూరు కాపులకు సముచిత స్థానాన్ని కల్పించాలని కోరుతూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ జగిత్యాల మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చెదలు సత్యనారాయణ మున్నూరు కాపు నేతలతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీకీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంపికకు కూడా బీసీలకు 42 శాతం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ మున్నూరు కాపులకు కూడా సమచిత స్థానం కల్పించాలని కోరుతూ జగిత్యాల జిల్లాలో మున్నూరు కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు కావున జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మున్నూరు కాపు చెదలు సత్యనారాయణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు.







