- కవిత ఎవరు.. జాగృతి ఏంటి..?
- జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుంది
- మీ వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోలేదా?
- కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి విమర్శలు
హైదరాబాద్, మహా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎంపీ అరవింద్ మరోసారి ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు..? జాగృతి ఏంటి..? అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని.. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీజు రియంబర్స్‌మెంటు ఆపింది ఎవరు? అని ప్రశ్నించారు. అణగారిన వర్గాల విద్యార్థులు ఎదగొద్దు అనే కుటిల ఆలోచనతో కల్వకుంట్ల కుటుంబానిధని ఆరోపించారు. అణగారిన ప్రజలు బాగుపడితే జీర్ణించుకోలేని దౌర్భాగ్యూలు మీరని విమర్శించారు. ఒక జనరేషన్ మొత్తాన్ని అణగదొక్కింది కల్వకుంట్ల కుటుంబం.. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మెన్ కు బీజేపీ తరఫున లేఖ పంపిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డికి కవితకు ములాఖత్ ఎంటి..? ఎందుకు రాజీనామా ఆమోదించటం లేరు..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. ఇద్దరు ఒక్కటే..ఇద్దరు బిజినెస్ పార్ట నర్లని విమర్శించారు. ప్రజలు పిచ్చోళ్లు కాదు, అన్ని గమనిస్తున్నారని ఎంపీ అరవింద్ తెలిపారు







